Parakala | ఆడబిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి..

Parakala | ఆడబిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి..

  • బీఆర్‌ఎస్ 12వ వార్డు అభ్యర్థి గంట కళావతి

Parakala | పరకాల, ఆంధ్రప్రభ : “ఆడబిడ్డగా వస్తున్న నన్ను ఆశీర్వదించాలి” అని బీఆర్‌ఎస్ 12వ వార్డు అభ్యర్థి గంట కళావతి ఓటర్లను అభ్యర్థించారు. శనివారం పరకాల మున్సిపాలిటీ 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గంట కళావతి ఓటర్లను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి ఆశీస్సులతో 12వ వార్డులో విజయం సాధించడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గంట కళావతి మాట్లాడుతూ.. తాను నిత్యం 12వ వార్డు ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటు, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. తనపై నమ్మకం ఉంచి ఓటర్లు ఆశీర్వదిస్తే, వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ కళావతి ఇచ్చారు.

Leave a Reply