Panyam |షార్ట్ సర్క్యూట్ తో మద్యం షాపు దగ్ధం
నంద్యాల జిల్లాలోని పాణ్యం మండల కేంద్రంలో ఒక వైన్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ అయి 40 లక్షల రూపాయలు మద్యం బాటిళ్లు దగ్ధమయ్యాయి. తెల్లవారుజామున సమయంలో షాప్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. స్థానికులు ఫైర్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. ఫైర్ ఇంజన్ వచ్చే సమయానికి షాప్ లో ఉన్న సుమారు 40 లక్షల రూపాయల మద్యం బాటిళ్లు దగ్ధమయ్యాయి. ఈ చుట్టుపక్కల ఎలాంటి నివాసాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశా రు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.