Panchayat | ప్రశాంతంగా ఎన్నికలు..

Panchayat | ప్రశాంతంగా ఎన్నికలు..

Panchayat, నల్లగొండ, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లాలో గురువారం ప్రశాంతంగా కొనసాగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. నల్లగొండ జిల్లా పరిధిలోని తిప్పర్తి మండలం, అని శెట్టి దుప్పలపల్లి పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఓటర్లు ఓటు వేసేందుకు చేసిన ఏర్పాట్లు పరిశీలించారు. మాక్ పోలింగ్ తో పోలింగ్ ప్రారంభం కాగా ఉదయం 7 గంటల నుండి ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

సమస్యత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. తనతో పాటు, జిల్లా ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మి, పోలింగ్ వెబ్ క్యాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ తెలియచేశారు. జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్. పోలింగ్ పూర్తయిన తర్వాత రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ముందుగా వార్డుల ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని.. తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు తెలియచేశారు.

Leave a Reply