Panchayat Elections | ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా..

Panchayat Elections | ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా..

Panchayat Elections, షాద్ నగర్, ఆంధ్రప్రభ : ఒకసారి అవకాశం ఇవ్వండి రాయికల్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రాయికల్ సర్పంచ్ అభ్యర్థి జ్యోతి శ్రీనివాస్ అన్నారు. రాయికల్ నుండి రామేశ్వరం వరకు డబల్ రోడ్డు ప్రభుత్వంచే మంజూరు చేయిస్తానని అన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తానని.. ఉంగరం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆశీస్సులతో తాము కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుంచి పోటీ చేస్తున్నామని.. యువ మహిళకు మహిళ నైనా నేను అందరికీ అందుబాటులో ఉండి తనదైన శైలిలో అందరినీ కలుపుకొని పోయి రాయికల్ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతానని అన్నారు. మీరందరూ నన్ను ఆదరించి రాయికల్ సర్పంచ్ గా అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply