సెపక్ తక్రా టోర్నమెంట్లో….

ఏర్పేడు ,అక్టోబర్ 10 (ఆంధ్రప్రభ): కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి సెపక్ తక్రా (Sepak Takraw) సబ్ జూనియర్స్ టోర్నమెంట్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లం విద్యార్థిని శిరీష (Student Shirisha) జాతీయ స్థాయికి ఎంపికైందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి ఆనంద్ తెలిపారు. సెపక్ తక్రా ఆటకు సంబంధించి శిరీష కు తిరుపతి నుంచి కోచ్ ని పాఠశాలకు రప్పించి ట్రైనింగ్ ఇప్పించడం జరిగిందని, శిరీష సెపక్ తక్రా ఆటలో రాణించి పాఠశాలకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకురావడం సంతోషకరంగా ఉందని ఆయన తెలిపారు.

పల్లం పాఠశాల నుండి ఇదివరకే ఇద్దరు విద్యార్థులు జాతీయస్థాయి ఆటల పోటీల్లో ప్రతిభ (talent) కనబరిచారని, భవిష్యత్తులో మరింతగా ప్రతిభను కనబరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి పోటీల్లో (national competitions) ప్రతిభ కనబరిచిన శిరీషకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంద్, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు. ఆటల పోటీల్లో శిరీష ప్రతిభ కనబరచడానికి కారణమైన వ్యాయామ ఉపాధ్యాయులు వాణి సోమశేఖర్ ని ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply