దండి మార్చ్ ను జయప్రదం చేయండి..

దండి మార్చ్ ను జయప్రదం చేయండి..

పలమనేరు, ఆంధ్రప్రభ : మాదక ద్రవ్యాలను అరికట్టాలనే లక్ష్యంతో ఏపీటిడిసి ఆధ్వర్యంలో ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న దండిమార్చ్. 2.0 కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పిలుపునిచ్చారు. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబందించిన కరపత్రాలను సోమవారం ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాజంలో మాదక ద్రవ్యాల నివారణకు అందరూ కృషి చేయాలన్నారు. మాదక ద్రవ్యల వాడకంతో జరిగే అనర్థాలపై అందరిలో అవగాహన రావాలన్నారు. ముఖ్యంగా యువత ఈ విషయంలో నడుం బిగించి మాదకద్రవ్యాల రహిత సమాజానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఈ నెల 12న పలమనేరు పట్టణంలో జరిగే 100 మీటర్ల జాతీయ పతాక ర్యాలీ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలోప్రోగ్రాం కోఆర్డినేటర్ రమణ, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు ప్రమీలమ్మ,రాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply