Painting l మచిలీపట్నం ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు..

Painting l మచిలీపట్నం ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు..
Painting l మచిలీపట్నం, ఆంధ్రప్రభః పర్యావరణ పరిరక్షణ పరిరక్షణ జాతీయ సమగ్రత ప్లాస్టిక్ నివారణ కొంచెం మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ నిర్వహించిన చిత్రలేఖన పోటీలకు మంచి స్పందన వచ్చింది . ఈ పోటీలు ఒకటో తరగతి నుండి డిగ్రీ వరకు చదువుకునే విద్యార్థులకు ఏర్పాటు చేశారు. ఈ పోటీలలో మచిలీపట్నం బంటుమిల్లి అవనిగడ్డ గుడివాడ కు చెందిన విద్యార్థులు సుమారు 300 మంది పాల్గొన్నారు. ప్రముఖ చిత్రకారుడు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రమేష్ ఆధ్వర్యంలో మచిలీపట్నం కాస్మోపాలిటీన్ క్లబ్ లో చిత్రలేఖన పోటీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ పిల్లలలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని బయట దిగడానికి ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. 100 పేజీలు పుస్తకాల్లోని విషయం ఒక చిత్రపటం ద్వారా వ్యక్తీకరించవచ్చని బాలాజీ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ నియమించాలని, కృష్ణ యూనివర్సిటీలో “ఫైన్ ఆర్ట్స్ “లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సును ఆంధ్ర యూనివర్సిటీ వలే ఏర్పాటు చేయాలని బాలాజీ అన్నారు. తల్లిదండ్రులు పిల్లలలో దాగి ఉన్న టాలెంట్ ని గుర్తించి వారిని ప్రోత్సహించాలని అన్నారు. తన పెన్షన్ డబ్బులతో భారీ ఎత్తున చిత్రలేఖన పోటీలు ఏర్పాటు చేసి పిల్లలను ప్రోత్సహిస్తున్న విశ్రాంత ఉపాధ్యాయులు రమేష్ అందరికీ ఆదర్శప్రాయుడని బాలాజీ అన్నారు..
నిర్వాహకులు చిత్రగాడు రమేష్ మాట్లాడుతూ చిత్రలేఖనం పిల్లల్లోని మానసిక పరిస్థితిని తెలియజేస్తుందని అన్నారు. నిర్వహించిన పోటీలలో పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపుదల, క్యారీ బ్యాగుల నివారణ, జాతీయ సమగ్రత వంటి అంశాలపై చక్కటి చిత్రాలను పిల్లలు గీసినట్లు తెలియజేశారు. విజేతలకు మార్చి ఎనిమిదో తారీఖున బహుమతులు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి బిఎస్వీ రమేష్, ఉపాధ్యక్షులు పిఎస్.ఎస్. ప్రసాద్, కాస్మో పాలిటిన్ క్లబ్ అధ్యక్షులు ఎస్.ఆర్. వై.ప్రసాద్( నవకళ బాబు )ఉపాధ్యక్షులు అంబటి కాంతారావు, కార్యదర్శి ఐ. సాయిరాం, సంయుక్త కార్యదర్శి వి. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు..
