Paint Scam : లెక్కల్లో,, కరప్షన్ కెమిస్ట్రీ AndhraPrabha SPL Story

Paint Scam : లెక్కల్లో,, కరప్షన్ కెమిస్ట్రీ AndhraPrabha SPL Story
బిల్లులన్నీ దొంగ లెక్కలే
పీఎంశ్రీకి పంగనామం
– రంగుల కొనుగోళ్లకు ₹ 69,500
– కొసరు కూలీ వ్యయం ₹ 1,30, 000
-అసలు కూలీ ఖర్చు ₹ 11,000
– ఖర్చు 8.46 శాతం
– బురిడీ 91.54శాతం
– అంటే అసలు కన్నా కొసరెక్కువ
– ఇదీ పెద్ద గురువు లెక్కల పాఠం
( అర్ధవీడు , ఆంధ్రప్రభ)
విద్యాబుద్దులు నేర్పే విజ్ఞాన కేంద్రం అది. ఆదర్శవంతమైన భవిష్యత్ భారత నిర్మాణానికి అక్షర భీజాలు విత్తే చదువుల సాగు క్షేత్రమది. అలాంటి పవిత్ర ఆలయాన తులసి వనమే కాదు వేళ్లునుకున్న గంజాయి మొక్కలూ ఉన్నాయి. వీటి సంతకాల కంపు పీఎంశ్రీ బిల్లుల నిండా కొడుతోంది. చివరికి గోడలకు వేసిన రంగుల్లోనూ (Paint Scam) కెమికల్ కు బదులు చిన్నారులకు కేటాయించిన నిధులపై పడిన చిల్లర కక్కుర్తి దూర్వాసనలు గుప్పుమంటున్నాయి.
Paint Scam

అర్తవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ( జి హెచ్ ఎస్) పీఎంశ్రీ (PMSRI) ( ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ అఫ్ ఇండియా ) పథకం కింద కెమిస్ట్రీ (Chenistry) ల్యాబ్, వివిధ (Play Grounds) క్రీడా ప్రాంగణాలు నిర్మించారు. రంగులూ వేశారు. అదే సమయంలో నిర్వాహకులు తమ చిల్లర బుద్దిని (Greedy Mind) పాండిత్యంగా ప్రదర్శించారు.
Paint Scam: కొసరెక్కువ

కొసరు అంటేనే కొద్దీ అని అర్థం. కానీ, పీఎంశ్రీ నిర్వాహాక పండితుని తత్వానికి అది విరుద్ధం. అసలు కన్నా కోసరే ఎక్కువ అన్నది ఆయన సిద్ధాంతం. ఆచరణలోనూ అదే చూపారు. రంగుల కొనుగోలుకు ₹. 69,500 చెల్లించనట్లు ఇన్వాయిస్ (Invoice) చూపారు. ఆ రంగును (Paints) అద్దినందుకు కూలీ ₹. 1,30,000 చెల్లించినట్లు బిల్లు పెట్టారు. దీనర్థం అసలు కన్నా కొసరెక్కువనేగా..! అదే విద్యార్థి చిన్నారులయితే ఓ ఐదు రూపాయలకు రేగి పండ్లు కొని ఒకటో, రెండో కొసరు అడుగుతారు. రేగిపళ్ళు వున్న బుట్టను అడగరు.ఎందుకంటే అసలు కన్నా కొసరు తక్కువ అని చిన్నారులకు వున్నా ఇంగితం కనుక. ఆ పండితుల పాండిత్యం పెద్దది కాబోలు అసలు కన్నా కొసరెక్కువ అని లెక్కలు చూపారు.
Paint Scam : కక్కుర్తిలోనూ ఘనులే
రంగులు అద్దడం ఆకర్షణీయమైన కళా నైపుణ్యం. ఇందుకు శారీరక శ్రమతో పాటు సృజనాత్మకతను జోడించాలి. ఇలాంటి కళాత్మక శ్రామికులు జిహెచ్ఎస్ లో ని వివిధ క్రీడా ప్రాంగణాలకు, కెమిస్ట్రీ ల్యాబ్ కు రంగులు అద్దారు. పీ ఎం శ్రీ నేమ్ బోర్డు అందంగా రాశారు. ఇందు కోసం వీరికి చెల్లించిన (Actual Wage)వాస్తవ కూలీ కేవలం ₹ 11,000 అని అంచనా.
Paint Scam : అంకెల్లో చోర కళ పలకరింత

కూడికలు చేయడంలోనూ, అదనపు అంకెలు జోడించడంలో నూ, ఒక్క చెమట చుక్క చిందకుండా తెల్ల కాగితాన్ని నలుపు చేయడంలోనూ సృజనా సామార్థ్యం గల ఆ పండితులు ఏకంగా ₹1,30,000 చెల్లించినట్లు బిల్లు (Bill Pay) రాశారు. వ్యత్యాసం 91.53 శాతం. అంటే కక్కుర్తి పడింది ₹. 1,19000. తద్వారా కళాత్మక శ్రమను అడ్డం పెట్టుకొని ఆ పండిత కళాకారులు కాసుల కక్కుర్తిని సృజించారు. తమ చిల్లర బుద్దిని సంతృప్తి పరుచుకున్నారు. ఈ చెల్లింపుల తాలుకు బిల్లులపై అప్పటి ప్రధానోపాధ్యాయులు, ఎం ఈవో- 1 అబ్దుల్ సత్తార్ సంతకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈయన కంభం మండలంలో ఇవే భాద్య తలు నిర్వహిస్తున్నారు.
ALSO READ : Avarics : బొక్కుడే..బొక్కుడు
