P M Modi | భూటాన్ పర్యటనకు కారణం..

P M Modi | భూటాన్ పర్యటనకు కారణం..
P M Modi ప్రధాని మోడీ (Modi) రెండు రోజుల భూటన్ పర్యటనను ద్విగిజయంగా ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు. భారత్, భూటన్ (Bharath, Bhutan) మధ్య సాంస్కృతిక, అథ్యాత్మిక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ పర్యటన దోహదపడింది. థింపూలో భూటన్ రాజు జిగ్మే ఖేసార్ నమ్గ్యేల్ వాంగ్చుక్, మాజీ రాజు జిగ్మే సింగ్యే వాంగ్చుక్ తో కలిసి కాలచక్ర ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రధాని అంకురార్పణ చేశారు. ఈ సందర్శన నెయిబర్హుడ్ ఫస్ట్ విధానానికి అనుగుణంగా రెండు దేశాల మధ్య చారిత్రక స్నేహాన్ని మరింత ధృడం చేసింది.
మోడీ (Modi) తన ఎక్స్ పోస్ట్ లో భూటన్ Bhutan) ప్రజలతో మన బంధం ఆత్మీయమైనది. ఈ పర్యటన మన సహకారాన్ని కొత్త శిఖరాలకు చేర్చింది అని పేర్కొన్నారు. తన పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య రెన్యువబుల్ ఎనర్జీ, మెంటల్ హెల్త్ సర్వీసస్, హెల్త్ కేర్ రంగాల్లో మూడు పరస్పర అవగాహన ఒప్పందాలను ప్రధాన మంత్రి మోడీ (Modi) కుదిర్చారు. భూటన్ లో ఎనర్జీ ప్రాజెక్టులకు 4 వేల కోట్ల రూపాయల లైన్ ఆఫ్ క్రెడిట్ ను భారత్ ప్రకటించింది. 1020 మెగా వాట్ల పునాట్సాంగ్చూ – 2 హైడ్రో ఎలక్రిక్ ప్రాజెక్ట్ ను భూటన్ రాజుతో కలిసి మోడీ ప్రారంభించారు. ఇది రెండు దేశాల ఎనర్జీ సహకార్ని బలోపేతం చేస్తుంది. కాలచక్రను మోడీ ప్రారంభించారు.
ఇది గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ – 2025లో భాగం. చాంగ్లీమిథాంగ్ స్టేడియంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భూటన్ ముఖ్య ఆచార్యుడు జె ఖెంపో నేతృత్వంలో పవిత్ర నృత్యాలు, ప్రార్థనలు నిర్వహించారు. టాషిచ్చోజోంగ్ గ్రాండ్ క్యూన్రే హాల్లో గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలను రాజుతో కలిసి మోడీ ప్రదర్శించారు. ప్రార్థనలు చేశారు. భూటన్ ఫోర్త్ కింగ్ 70వ జయంతి ఉత్సవాల్లో కూడా మోడీ పాల్గొన్నారు. ఎనర్జీ, రక్షణ, సాంకేతిక వాణిజ్య అంశాలు గురించి ప్రధానంగా మోడీ, రాజు (Modi, Raju) మధ్య చర్చలు జరిగాయి. భూటన్ అభవృద్ది ప్రయాణంలో భారత్ కీలక భాగస్వామిగా ఉన్నందకు గర్వపడుతున్నామని మోడీ చెప్పారు.
