origin of life | హైడ్రోజన్ సైనైడ్‌పై శాస్త్రవేత్తల సంచలన పరిశోధన

origin of life | హైడ్రోజన్ సైనైడ్‌పై తాజా శాస్త్రీయ అధ్యయనం
అతిశీతల వాతావరణంలో అసాధారణ రసాయనిక చర్యలు
జీవ భవన బ్లాక్స్ ఏర్పాటులో హెచ్‌సీఎన్ పాత్ర
భూమికి వెలుపల కూడా జీవం పుట్టుకకు అవకాశాలా?
జీవ ఆవిర్భావంపై కొత్త సిద్ధాంతానికి దారి
origin of life | భూమిపై జీవం ఆవిర్భావానికి విషపదార్థం కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇటీవలి పరిశోధన ఆధారంగా ఈ విధమైన అంచనాకు వచ్చారు. ఇందుకు సంబంధించిన తాజా పరిశోధన ఏసీఎస్ సెంట్రల్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురితమైంది. కొత్త అధ్యయనం ప్రకారం, హైడ్రోజన్ సైనైడ్ అనేది విషపూరిత రసాయనం లేదా పదార్థం. ఇది మానవాళికి కూడా ప్రాణాంతకం. అయితే, ఇది శీతల వాతావరణంలో ఘన స్ఫటికాలుగా మారుతుందని, ఈ స్ఫటికాల ఉపరితలాలు అసాధారణంగా రసాయనిక చర్యలకు గురవుతుం టాయని శాస్త్రవేత్తలు తేల్చారు.

దీనివల్ల కనిష్ట ఉష్ణోగ్రతల వద్ద అసాధారణ రసాయనిక ప్రతిచర్యలు జరిగి, జీవం ఆవిర్భావానికి అవసరమైన మూలకాలు ఏర్పడి ఉంటాయని, ఈ ప్రతి చర్యలు జీవం ప్రాథమిక నిర్మాణ భాగాలను ఉత్పత్తిచేసే గొలుసు ప్రక్రియను ప్రేరేపించి ఉండొచ్చని ఒక అవగాహనకు వచ్చారు. జీవం ఎలా ప్రారంభమైందో మనకు ఖచ్చితంగా తెలియకపోవచ్చు, కానీ జీవులలోని కొన్ని పదార్థాలు ఎలా ఆకారం పొందుతాయో అర్థం చేసుకోవచ్చు అని అధ్యయన రచయిత మార్టిన్ రహమ్ చెప్పారు. హైడ్రోజన్ సైనైడ్ (హెచ్‌సీఎన్) విషపదార్ధమే అయినప్పటికీ, నీటితో కలిసినప్పుడు అమినో ఆవ్లూలు, న్యూక్లియోబేసెస్ వంటి జీవ భవనబ్లాక్లను ఏర్పరుస్తుంది. చల్లని వాతావరణంలో (ఉదా.. భూమి ప్రారంభ దశ లేదా బాహ్య గ్రహాల్లో) ఈ హెచ్‌సీఎన్ స్ఫటికాలు కాబ్వెబ్ వంటి నిర్మాణాలుగా ఏర్పడతాయి. ఈ నిర్మాణాల చివరల్లోని బహుముఖ ఉపరితలాలు చిన్న రసాయనిక రియాక్టర్లుగా పనిచేస్తాయి.
ఇది కంప్యూటర్ సిమ్యులేషన్ల ద్వారా నిరూపితమైందని తాజా అధ్యయనం పేర్కొంది. భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన సరికొత్త ఊహాగానానికి అవకాశం కల్పించిందని తెలిపింది. అలాగే భూమికి వెలుపల వాతావరణాలలో హైడ్రోజన్ సైనైడ్ సర్వసాధారణం. తోకచుక్కలు, గ్రహాలు, చంద్రుడి వాతావరణంలోనూ హెచ్‌సీఎన్ ఆనవాళ్లున్నాయి. ఈలెక్కన శని ఉపగ్రహం టైటాన్ వంటి చల్లని ప్రదేశాల్లో కూడా ఇలాంటి రసాయనిక ప్రక్రియలు జరిగి ఉండవచ్చని మార్కో కాపెల్లెట్టి, #హల్డా సాండ్స్ట్రోమ్, మార్టిన్ రహమ్ చెబుతున్నారు. ఘనీభవించిన పరిస్థితులలో ఈ అణువు (హెచ్‌సీఎన్) ఎలా ప్రవర్తిస్తుందో బాగా అర్థం చేసుకోవడానికి, కంప్యూటర్ సిమ్యులేషన్లను ఉపయోగించి ఘన #హడ్రోజన్ సైనైడ్‌ను వీరు అధ్యయనం చేశారు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైనది. ఎందుకంటే సాధారణంగా అతిశీతల పరిస్థితులలో రసాయనిక చర్యలు నెమ్మదిగా జరుగుతాయి. కానీ, ఈ సైనైడ్ స్ఫటికాల వల్ల అవి వేగంగా, సమర్థవంతంగా జరిగాయని తేలింది. నిజంగా ఈ పరిశోధన చాలా ఆసక్తిని కలిగిస్తోంది.
జీవం ఎలా పుట్టిందనే ప్రశ్నకు కొత్త భాష్యాన్ని ఇస్తోంది. పరిశోధనలో భాగంగా, ఈ బృందం 450 నానోమీటర్ల పొడవైన సిలిండర్ లాంటి స్థిరమైన #హడ్రోజన్ సైనైడ్ క్రిస్టల్‌ను రూపొందించింది. ఈ నిర్మాణంలో గుండ్రని బేస్, బ#హుళ చదునైన ముఖాలు కలిగిన టాప్ ఉన్నాయి. ఇవి కత్తిరించిన రత్నాన్ని పోలి ఉన్నాయి. క్రిస్టల్ ఉపరితలాల రసాయన శాస్త్రాన్ని విశ్లేషించడం ద్వారా, #హడ్రోజన్ సైనైడ్‌ను #హడ్రోజన్ ఐసోసైనైడ్, మరింత రియాక్టివ్ సమ్మేళనంగా మార్చగల రెండు ప్రతిచర్య మార్గాలను పరిశోధకులు గుర్తించారు. వీరి అంచనాలను ప్రయోగశాలలో మరోదఫా పరీక్షించాలని పరిశోధకులు భావిస్తున్నారు. ఏదైమైనా ఈ బృందం జీవం పుట్టుకకు గల కారణాల అన్వేషణలో ముందడుగేసిందని చెప్పవచ్చు.
click here to read 15 Numbers | జార్ఖండ్‌లో కాల్పుల మోత

