OPS | మళ్లీ డీఎంకేనే గెలుస్తది..

OPS | మళ్లీ డీఎంకేనే గెలుస్తది..
ఓపీఎస్ కామెంట్స్ పై రాజకీయ వర్గాల్లో చర్చ
OPS |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం (O. Panneerselvam) అలియాస్ ఓపీఎస్.. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (Chief Minister M.K. Stalin) ను అసెంబ్లీ ప్రాంగణంలో స్వయంగా కలుసుకోవడం పెను సంచలనానికి దారితీసింది. కొంతసేపు ఇద్దరూ సచివాలయంలో చర్చలు జరిపారు.
అనంతరం, డీఎంకే పాలనపై ఓపీఎస్ ప్రశంసల వర్షం కురిపించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ డీఎంకే గెలుస్తోందని వ్యాఖ్యానించారు. డీఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. ఓపీఎస్ చేసిన ఈ పొలిటికల్ కామెంట్స్ తమిళనాట రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. మంత్రులు తంగం తెన్నరసు, ఎంఆర్‌కె పన్నీర్‌సెల్వం సమాధానమిస్తున్న సమయంలో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అయితే, దీనికి భిన్నంగా ఓపీఎస్ మాత్రం స్టాలిన్ నాయకత్వంలోని ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని ప్రశంసలు కురిపించారు. ఇవాళ జరిగిన ఈ భేటీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు కొత్త కూటమి అవకాశాలపై ఊహాగానాలకు దారితీసింది.
