Operation Kagar Effects | లొంగిపోయిన 16 మంది మావోయిస్టులు

సుక్మా : దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ ఊహించని ఫలితాలు వస్తున్నాయి. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని దట్టమైన అడవుల్లో భద్రతా దళాలు అడుగడుగునా గాలిస్తున్నాయి. అదేవిధంగా కర్రిగుట్టలు, నారాయణపూర్ జిల్లాలోని మాఢ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో పదుల సంఖ్యల మావోయిస్టులతో పాటు అగ్రనేతలు నంబాల కేశవ రావు లాంటి వారు ప్రాణాలు కోల్పోయారు.

ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొత్తం 16మంది మావోయిస్టులు ఇవాళ మధ్యాహ్నం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ‘నియాద్ నెల్లానార్’ పథకంలో భాగంగా ఆపరేషన్ చేయూత పేరుతో తక్షణ ఆర్థిక సాయం, జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో మావోయిస్టులు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. సరెండర్ అయిన వారిలో మొత్తం ఆరుగురిపై రూ.25 లక్షల రివార్డులు ఉన్నాయని.. దీంతో స్థానిక కెర్లపెండ గ్రామం నక్సల్స్‌ రహిత గ్రామంగా మారిపోయిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Leave a Reply