Ootkur | బీజేపీతోనే అవినీతి రహిత పాలన

Ootkur | బీజేపీతోనే అవినీతి రహిత పాలన
- రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య
Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ ఎంపీ నిధులతో ఊట్కూర్ పట్టణాన్నిఅన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు ప్రజల ఆశీస్సులతో గెలుపొందిన ప్రజా ప్రతినిధులు ముందుకు సాగాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మక్తల్ మాజీ ఎంపీపీ బి.కొండయ్య, పార్టీ నారాయణపేట మాజీ జిల్లా అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాస్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో సర్పంచుగా ఎం.రేణుక భరత్, ఉప సర్పంచ్‌గా రమేష్ తోపాటు వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సన్మాన సభలో వారు మాట్లాడుతూ ప్రజలు అవినీతి రహిత పాలనకు పట్టం కట్టారని పాలకవర్గం గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధి లక్ష్యంగా కృషి చేయాలన్నారు. ఊట్కూర్ మండలంలో 8 సర్పంచ్ స్థానాలను బిజెపి గెలుపొందడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో భాజపా నాయకులు సోమశేఖర్, ఎం శేషప్ప, కృష్ణయ్య గౌడ్, ఎం విజయ్ కుమార్, కొండన్ గోపాల్, కుర్వ ఆశప్ప, లక్ష్మణ్ రమేష్, హన్మంతు, రోషణప్ప తదితరులు పాల్గొన్నారు.
