Ootkur | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టండి

Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు లబ్ధిదారులు వేగవంతంగా చేపట్టాలని ఊట్కూర్ ఇన్చార్జి ఎంపీడీవో కొండన్న, పెద్ద జట్రం సర్పంచ్ వాకిటి వెంకటేష్ అన్నారు. గురువారం నారాయణపేటజిల్లా
ఊట్కూర్ మండల పరిధిలోని పెద్ద జట్రం, అవసలోనిపల్లి, మొగ్ధంపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సకాలంలో పూర్తి చేస్తే దశలవారీగా బిల్లులు చెల్లిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఉపాధి హామీ పథకం చేపట్టిందని కూలీలు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలని వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో కూలీలు ఉదయం వేళా పనులు చేసుకోవాలన్నారు. నర్సరీలలో 100 శాతం మొక్కలు పెంచే విధంగా చూడాలని మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విధిగా పాటించాలన్నారు. నర్సరీలలో పెంచుతున్న మొక్కల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు వెంటనే తొలగించి సంరక్షణ బాధ్యతాయుతంగా చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న వివిధ పనులు పారదర్శకంగా చేపట్టాలన్నారు. టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామాల్లో ఉపాధి పనులు వేగవంతంగా కొనసాగే విధంగా ప్రజలకు వివరించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఈసీ మైపాల్ రెడ్డి, టి ఏ శివ కుమార్, పంచాయతీ కార్యదర్శి భవిత ఫీల్డ్ అసిస్టెంట్లు బాలప్ప, రాముతదితరులు పాల్గొన్నారు.

Leave a Reply