Ootkur | కుష్టువ్యాధిని నివారిద్దాం.

Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు కృషి చేస్తూ కుష్టి వ్యాధిని సమూలంగా నివారిద్దామని పులిమామిడి డాక్టర్ సాయిరాం పిలుపునిచ్చారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పులి మామిడిలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ కుష్టు వ్యాధి నివారణ ర్యాలీని తీసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు ప్రతి గ్రామంలో కుష్టి వ్యాధి నివారణ కోసం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ వ్యాధి వచ్చినవారికి ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ చేస్తుందన్నారు. వైద్యుల సలహా మేరకు మందులు వాడితే వ్యాధి తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ మణిమాల, సిహెచ్ఓ విజయలక్ష్మి, ఎంపీ హెచ్ఈఓ గోవిందరాజు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
