విపత్తులో ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల

విపత్తులో ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల

ఒంగోలు రూరల్, నవంబర్ 1, ఆంధ్రప్రభ: ప్రకృతి విప‌త్తులో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల (Damacharla) కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవార్డు అందజేశారు. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో శనివారం తుఫానుతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆస్తి నష్టం, ప్రాణం నష్టం జరగకుండా చర్యలు తీసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు, అధికారులకు ఉత్తమ అవార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది.

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల కు ఉత్తమ అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు సమాజంలో ప్రకృతి విపత్తులైన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఉత్తమ అవార్డు రావడంతో బాధ్యత మరింత పెరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సూచనలతో నియోజకవర్గంలో ప్రాణ ఆస్తి నష్టం ఉన్న జరక్కుండా చర్యలు తీసుకున్నాం. రాబోయే రోజుల్లో ఒంగోలు నియోజకవర్గంలో సమస్యలను అధిగమించి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Leave a Reply