Ongole | మహోన్నతుడు.. వివేకానంద

Ongole | మహోన్నతుడు.. వివేకానంద

  • కలెక్టర్, ఎస్పీ

Ongole | ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు : భారతదేశం యొక్క సంప్రదాయం, సంస్కృతీ, గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద అని, వారిని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని వీసీ హాల్లో కలెక్టర్ పి.రాజాబాబు, జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజుతో కలిసి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ, భారతదేశ సంప్రదాయం, సంస్కృతీ, గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద అని, వారిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, స్వామి వివేకానంద అందరికీ స్ఫూర్తిదాయకమని, నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా మన దేశ సంస్కృతిని, చరిత్రను తెలియచేసిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు. వారు మనందరికీ ఆదర్శప్రాయుడన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని స్వామి వివేకానందకు ఘన నివాళులర్పించారు.

Leave a Reply