భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందాడు. శిథిలాల కింద చిక్కుకున్న చల్ల కామేశ్వరరావు అనే వ్యక్తిని సహాయక బృందాలు వెలికితీశాయి. తీవ్రంగా గాయపడి కొనఊపిరితో ఉన్న అతడిని హుటాహుటిన దవాఖానకు తరలించారు.
అయితే చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడని అధికారులు వెల్లడించారు. కామేశ్ కాలు తొంటి దగ్గర నుజ్జునుజ్జు అయిందని, ఎడమ చేయి విరిగిపోయిందని తెలిపారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నదని, ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు.