యాద్రాద్రి, ఆంధ్రప్రభ : ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (MLA Beerla Ailaiah) నివాసంలో అద్దెకు ఉంటున్న ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. గంధమల్ల రవి (Gandamalla Ravi) (38) అనే వ్యక్తి యాదగిరి పట్టణంలోని ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లోని పెంట్ హౌస్‌లో ఉంటున్నాడు. రవి మృత దేహాన్ని భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని ఐలయ్య సందర్శించారు. మృతిచెందిన రవికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
సంఘటన జరిగిందిలా…
గంధమల్ల రవి యాదగిరి పట్టణం (Yadagiri town) లోని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంట్లోని పెంట్ హౌజ్‌లో నివాసం ఉంటున్నాడు. రెండు రోజులుగా అతడు సొంత గ్రామమైన సైదాపురానికి వెళ్లి.. శుక్రవారం యాదగిరిగుట్టకు వచ్చి మరణించాడు. అదే రోజు రాత్రి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. భార్యతో కలిసి రవి గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యే ఇంట్లోనే పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రవి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.