లారీ బైక్ డీ: ఒకరు మృతి

లారీ బైక్ డీ: ఒకరు మృతి

జన్నారం, ఆంధ్రప్రభ: లారీ బైకును ఢీకొన్న ప్రమాదంలో ఒక్కరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన మంచిర్యాల జిల్లా (Mancherial district) లో చోటుచేసుకుంది. జిల్లాలోని జన్నారం మండలంలోని మహమ్మదాబాద్ గ్రామ సమీపాన ప్రధాన రహదారిపై మంగళవారం ఉదయం 9 గంటలకు లారీ బైకును ఢీకొన్న ప్రమాదంలో బైక్ పై ఉన్న మండలంలోని సింగరాయపేటకు చెందిన అడాయి మారుతి(25) అక్కడికక్కడే మృతి చెందగా, మండలంలోని జన్నారంకు చెందిన చుక్క గంగాధర్ కు కుడికాలు విరిగి తీవ్రగాయాలయ్యాయి.

ఈ విషయమై కాల్ రాగానే, 108 అంబులెన్స్ ఈఎంటీ కిషన్, పైలెట్ గంగాధర్ హుటాహుటిన అక్కడికి చేరుకొని చికిత్స చేయగా మారుతి (Maruti) అప్పటికే చనిపోయాడని, తీవ్రగాయాలకు గురైన గంగాధర్ ను చికిత్స నిమిత్తం లక్షేటిపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.నూజివీడుకు చెందిన లారీ డ్రైవర్ బలరామకృష్ణ అతివేగంగా, ఆజాగ్రత్తగా లారీ నడిపి బైక్ ను ఢీకొట్టడం వల్లనే ప్రమాదం జరిగింది.సంఘటన స్థలాన్ని సందర్శించి,కేసు దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు.

Leave a Reply