English Olympiad | ఇంగ్లీష్ ఒలంపియాడ్ పోటీలు…..

English Olympiad | ఇంగ్లీష్ ఒలంపియాడ్ పోటీలు…..
English Olympiad | రేగొండ, ఆంధ్రప్రభ : కొత్తపల్లిగోరి మండలంలో ఎల్టా ఆధ్వర్యంలో ఇంగ్లీష్ ఒలింపియాడ్ అండ్ ఎలక్యూషన్(English Olympiad and Elocution) పోటీలను మండలంలోని జడ్పిహెచ్ఎస్ జగ్గయ్యపేట కొత్తపల్లిగోరి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో జూనియర్ విభాగంలో ఎన్. రసజ్ఞ జడ్పిహెచ్ఎస్ గోరి కొత్తపల్లి విద్యార్థి ప్రతిభ కనపరిచి మొదటి స్థానం సాధించారు.
అలాగే ఇంగ్లీష్ ఒలింపియాడ్ పోటీలలో సీనియర్స్ విభాగంలో ప్రథమ స్థానం పి. వైష్ణవి, ఈ. విష్ణు తేజ, ఎం. నిషిత జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు పాల్గొని మొదటి స్థానాన్ని సాధించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్(School Complex) ప్రధానోపాధ్యాయురాలు పాల్గొని పర్యవేక్షించారు. అలాగే పీవీజీ. కృష్ణ, కే ఉత్తర ఆంగ్ల భాష ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు. జడ్పిహెచ్ఎస్ కొత్తపల్లి గోరి ప్రధానోపాధ్యాయురాలు కే.మాధవి లత పర్యవేక్షించారు.
