ఆయిల్ ఫామ్ సాగు పట్ల తుమ్మలకు ఉన్న చిత్తశుద్ధి అమోఘం

ఆయిల్ ఫామ్ సాగు పట్ల తుమ్మలకు ఉన్న చిత్తశుద్ధి అమోఘం

రైతుల ప్రయోజనమే లక్ష్యంగా కార్యనిర్వహణ
దుబాయిలో ఇబ్బందికర పరిస్థితి ఉన్నా నెరవని ధీమా


దమ్మపేట, మార్చి 6 (ఆంధ్రప్రభ): తెలంగాణ హార్టికల్చర్, ఆయిల్ ఫెడ్ మీద రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం అయిన హైకోర్టులో ప్రైవేటు ఆయిల్ ఫెడ్ కంపెనీస్ మూకుమ్మడిగా చేసిన కుట్రను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రివర్యులు తుమ్మల తన చాకచక్యంతో తిప్పికొట్టారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫెడ్ ప్రయోజనాలను దెబ్బతీయటానికి వేసిన రిట్ పిటిషన్ 3736/2026 లో జీవో నెంబర్ 594 మీద ఉన్న స్క్వాష్ పిటిషన్ మంత్రి తుమ్మల దుబాయ్ లో తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే స్థానిక వ్యవసాయ ఉన్నతాధికారులు ,ఆయిల్ ఫెడ్ సిబ్బందితో మాట్లాడి కేసు తరుపున ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ని ఒప్పించి కేసు డిస్మిస్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విషయంతో తుమ్మలకు రైతాంగం పట్ల, ఆయిల్ ఫీడ్ నిర్వహణ పట్ల ఉన్న గౌరవం మరింత ద్విగుణీకృతం అయిందని రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదే కేసులో ప్రైవేటు ఆయిల్ ఫెడ్ తరుపున సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది గోపాల సుబ్రహ్మణ్యం, సుప్రీంకోర్టు మాజీ సోలసిటర్ జనరల్ లను కోట్లాది రూపాయలు వెచ్చించి మాట్లాడి వారి తరుపున వాదిస్తే మంత్రి దుబాయ్ నుండి ఇక్కడి అధికారులను న్యాయవాదులను రికార్డు పరంగా కార్యోన్ముఖులను చేసి రిట్ పిటిషన్ డిస్మిస్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. పామాయిల్ రైతాంగ శ్రేయస్సు కోసం తుమ్మల తీసుకువచ్చిన అత్యధిక ఓ ఈ ఆర్ ఫార్ములా దేశంలోనే అత్యధిక ఓఈఆర్ గా ప్రశంసలు అందుతున్న తరుణంలో దీనిని రైతులకు ప్రతిఫలాలు అందకుండా చేయడానికి గాను ప్రైవేటు ఫ్యాక్టరీలు పన్నిన కుట్రను తుమ్మల తెలివిగా తిప్పి కొట్టడం పట్ల రైతులు ,రైతు సంఘాల నాయకులు, ఆయిల్ ఫెడ్ బాధ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.హర్షం వ్యక్తం చేసినవారిలో రాష్ట్ర ఆయిల్ పామ్ రైతు సంఘం అధ్యక్షులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్ , మాజీ జెడ్పిటీసి పైడి వెంకటేశ్వరరావు , మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు ,మద్దినేని వెంకట్ , కేవీ . సత్యనారాయణ , మన్నెం అప్పారావు ,కాసాని నాగప్రసాద్ ,దొడ్డా ప్రసాద్ ,ఎర్రా వసంతరావు , బొల్లికొండ ప్రభాకర్ లు వున్నారు .

Leave a Reply