ఆఫీసర్లు బిజీబిజీ
- పర్యవేక్షణలో ప్రజాప్రతినిధులు
(ఆంధ్రప్రభ, మాచర్ల ) : మాచర్ల ( Macharla) పట్టణంలో నిర్వహించనున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాక సందర్భంగా ఏర్పాట్లను మాజీ సభ్యులు పెందుర్తి వెంకటేష్, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఇతర రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కలసి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి శుక్రవారం పర్యవేక్షించారు.

హెలిప్యాడ్ (Helipad), ప్రజా వేదిక, క్యాడర్ మీటింగ్ నిర్వహించే సభ ప్రాంగణం, యాదవ బజారులలో ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, అసౌకర్యాలు లేకుండా చూసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే జూలకంటి పలు సూచనలు చేశారు.
