Oath taking | గ్రామ పునరావాసం కోసం కృషి

Oath taking | గ్రామ పునరావాసం కోసం కృషి
- ప్రమాణ స్వీకారోత్సవంలో సర్పంచ్ సంగీత శేఖర్ గౌడ్
Oath taking | మక్తల్, ఆంధ్రప్రభ : భూత్పూర్ గ్రామ పునరావాసం కోసం కృషి చేస్తానని గ్రామ నూతన సర్పంచిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సర్పంచ్ సంగీత శేఖర్ గౌడ్ అన్నారు. ఇవాళ నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని భూత్పూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ గా సంగీత శేఖర్ గౌడ్ వార్డు మెంబర్లతో స్పెషల్ ఆఫీసర్ రాఘవేంద్ర, పంచాయతీ కార్యదర్శి వీరన్న ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈసందర్భంగా సర్పంచ్ సంగీత శేఖర్ గౌడ్ మాట్లాడుతూ… ముంపు గ్రామమైన భూత్పూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు తన శక్తి మేరకు కృషి చేస్తానన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో భూత్పూర్ గ్రామ పునరావాసం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నతాధికారులతో మాట్లాడి పునరావాసం ఏర్పాటుకు అవసరమైన చర్యలను మంత్రి ప్రారంభించడం జరిగిందన్నారు.
త్వరలోనే పునరవాస పనులు ప్రారంభించే అవకాశం ఉందని ఆమె తెలిపారు. గ్రామ అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఎన్నికల్లో తనను సర్పంచ్ గా గెలిపించిన గ్రామ ప్రజలకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి సర్పంచ్ సంగీత శేఖర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన సంగీత శేఖర్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి తదితరులు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు పసుల విష్ణువర్థన్ రెడ్డి, మేదరి శ్రీనివాస్, సాలంబిన్ ఉమర్ బస్రవి,మాజీ ఎంపిటిసి కే.కురుమయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు కోళ్ళ వెంకటేష్, రఘుపతి రెడ్డి, భీమ్ సేన్ రావు ,రాఘవేందర్ రెడ్డి, ఉప్పరి హనుమంతు, కె.చెన్నయ్య గౌడ్, బత్తలయ్య, వాకిటి నాగప్ప, కురువ నరసింహ, నరసింహ, కోరి నరసింహ, అంబర్నాథ్ అంజప్ప, తదితరులు పాల్గొన్నారు.
