మనిషి పరిపూర్ణత సాధించాలంటే అహాన్ని త్యజించాలి..

మనిషి పరిపూర్ణత సాధించాలంటే అహాన్ని త్యజించాలి..
సూర్యప్రభ వాహనంపై శ్రీవారు
నేత్రపర్వంగా బ్రహ్మోత్సవాలు
నిజామాబాద్, ఆంధ్రప్రభ : మనిషి ఏ పని చేసినా ఏ కార్యానికి కదలాడిన అహం అనే లక్ష్యాన్ని త్యా గం చేసిన రోజు సమాజం ఆ మనిషిని స్వాగతిస్తదని ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన జీయర్ స్వామి అన్నారు. అదే విధంగా కేవలం సమాజమే కాదు ఆ సాక్షాత్తు భగవంతుడు కూడ అక్కున చేర్చు కుంటాడని అన్నారు. సూర్యప్రభ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. నిజామాబాద్ నగరానికి సమీపంలోని నర్సింగ్‌పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటే శ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆధ్యా త్మిక వాతావరణం నెలకొం ది. మంగళవారం నిజామాబాద్ నగరంలోని నర్సింగ్ పల్లిలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు స్వామి వారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ ఉత్సవాలకు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన జీయర్ స్వామి ఆశీర్వ చనాలతో విచ్చేసి భక్తులను ఆశీర్వదించారు. వాహనం ముందు భక్తజన బృందాలు భజన లతో స్వామి వారిని కీర్తి స్తుండగా, మంగ ళవాయి ద్యాల నడుమ స్వామివా రి వాహనసేవ కోలాహలం గా జరిగింది. సూర్యప్రభ వాహనం ఆయు రారో గ్యప్రాప్తి సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్య కారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకా శిస్తూ వృద్ధి పొందుతు న్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు

నాది” “నేను తెచ్చాను” అనే భావాన్ని వదిలినప్పుడే..
భగవంతుడికి చిన్ని పండు కూడా ప్రసాదంగా సమ ర్పించినప్పుడు “నాది” “నేను తెచ్చాను” అనే భావాన్ని వదిలినప్పుడే స్వామి ప్రేమగా స్వీకరించి ఆ ఫలాన్ని ప్రసాదంగా అందిస్తాడని చిన్న జీయర్ స్వామి అన్నారు. అదే విధంగా సమాజానికి కూ డా ఏ స్వార్థం లేకుండా ఎటువంటి ప్రతిఫలం లేకుండా మనిషి సేవ చేయాలని సూచించారు.
కదలాడే దైవం చిన్న జియ్యర్ స్వామి
టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
సాక్షాత్తు భగత్ స్వరూపులు చిన్నజీయర్ స్వామి వారనీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భగవత్ స్వరూ పులు చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు ప్రత్యక్షంగా దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇందూరు తిరుమల గోవిం ద వనమాల క్షేత్ర దైవ మహిమలు చాలా ఉన్నాయన్నారు.

తాను కూడా కోరుకున్న కోరికలన్నీ తీర్చిన భగవంతుడు మా పల్లె శ్రీనివాసుడు అన్నారు.. ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం బ్రహ్మోత్స వాల్లో 3వరోజు సాయంత్రం వేడుకల్లో శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు, పిసిసి అధ్య క్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఈ వేడుకలు దిల్ రాజు కుటుంబ సభ్యులు శిరీష్ రెడ్డి నరసింహ రెడ్డి విజయ సింహారెడ్డి హరీష్ రెడ్డి లతో పాటు డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి కాంగ్రెస్ నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ,నుడా చైర్మన్ కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్ నరాల రత్నాకర్ సుమన్ రాంభూపాల్, రామ కృష్ణ మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం గన్రాజ్ తదితరులు పాల్గొన్నారు
