NZB | మూడు పంచాయతీలు ఏకగ్రీవం…

సదాశివనగర్, ఆంధ్రప్రభ : సదాశివనగర్ మండలంలోని తిర్మన్‌పల్లి, తుక్కోజివాడి, సజ్య నాయక్ తాండ గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా అయినట్లు గ్రామస్తులు తెలిపారు.

తిర్మన్‌పల్లి సర్పంచ్‌గా లాల్‌సింగ్, తుక్కోజివాడి సర్పంచ్‌గా సంగారావు, సజ్య నాయక్ తాండ సర్పంచ్‌గా ప్రకాశ్ ఎన్నికయ్యారు. సంబంధిత పంచాయతీల్లో వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్న‌ట్టు గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో నూతన పాలకవర్గానికి గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.

Leave a Reply