- శతకొట్టిన రిచిన్, విలియమ్సన్
- ఫిలిప్స్ – మిచెల్ మెరుపులు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండో సెమీస్‌లో భాగంగా నేడు లాహోర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ న్యూజిలాండ్ బ్యాటర్లు దంచికొట్టారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్.. సౌతాఫ్రికా బౌలర్లను ఉతికారేసింది. నిర్ణీత 50 ఓవ్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు సాధించిన కివీస్.. ఈ సీజన్ లోనే రికార్డు స్కోర్ నమోదు చేసింది.
కాగా, కివీస్ టాపార్డర్ బ్యాటర్లలో యువ ఆటగాడు రచిన్ రవీంద్ర – కేన్ విలియమ్సన్ సఫారీలపై శతకాలతో గర్జించారు. సెంచరీలతో చెలరేగిన రచిన్ రవీంద్ర (101 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్ 108) – కేన్ విలియమ్సన్ (94 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్ 102) రెండో వికెట్ కు 154 బంతుల్లో 164 పరుగుల జోడించారు.

అయితే, 33.3వ ఓవర్లో కగిసో రబడ వేసిన బంతికి రచిన్ రవీంద్ర ఔటవ్వగా… వియాన్ ముల్డర్ వేసిన 39.5వ ఓవర్లో కేన్ విలియమ్సన్ పెవిలియన్ చేరాడు. రచిన్ – విలియమ్సన్ ఔటైన తరువాత ఆఖరి ఓవర్లలో క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్ (37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ 49), గ్లెన్ ఫిలిప్స్ (27 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ 49 నాటౌట్) ధానాధన్ బౌండరీలతో విరుచుకుపడి.. తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నారు.
దక్షినాఫ్రికా బౌలర్లలో లుంగీ నిగిడి మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడ రెండు, వియాన్ మల్డర్ ఒక్క వికెట్ దక్కించుకున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ద్వాదా అత్యధిక పరుగులు :-
- లాహోర్ – దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్ ద్వారా 362/6 ఈరోజు
- లాహోర్ – ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా ద్వారా 356/5 – 2025
- లాహోర్ – ఆస్ట్రేలియా vs ఇంగ్లండ్ ద్వారా 351/8 – 2025
- ది ఓవల్ – USA vs న్యూజిలాండ్ ద్వారా 347/4 – 2004
- ఓవల్ – భారత్ vs పాకిస్థాన్ ద్వారా 338/4 – 2017
ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తరఫున అత్యధిక స్కోర్
- లాహోర్ 2025 – దక్షిణాఫ్రికా పై 362/6 పరుగుఉల – ఈరోజు
- ది ఓవల్ – 2004 USAపై 347/4 పరుగులు
- కరాచీ 2025 – పాకిస్థాన్ పై 320/5 పరుగులు
- జోహన్నెస్‌బర్గ్ 2009 – శ్రీలంక పై 315/7 పరుగులు
వన్డేల్లో లాహోర్‌లో గడాఫీ స్టేడియంలో అత్యధిక తొలి ఇన్నింగ్స్ స్కోర్లు :
- 2015 – జింబాబ్వే vs పాకిస్థాన్ ద్వారా 375/3
- 2025 – దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్ ద్వారా 362/6 – ఈరోజు
- 2008 – బంగ్లాదేశ్ vs శ్రీలంక ద్వారా 357/9