గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి…

గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : గర్భిణీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని కొత్తపల్లి సర్పంచ్ ఆర్. నర్సిములు అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొత్తపల్లి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు బాలింతలకు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గర్భిణీలు, కిశోర బాలికలు బాలింతలకు అంగన్వాడి కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న సరుకులు తీసుకువెళ్లాలన్నారు.
గర్భిణీ మహిళలుఆకుకూరలు పండ్లు పాలు గుడ్లు తినడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండడంతో పాటు పుట్టబోయే బిడ్డ బలంగా జన్మిస్తారని అన్నారు. బాలింతలు బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం వల్ల తల్లిపాలు పుష్కలంగా రావడంతోపాటు బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని సంపూర్ణంగా అందజేస్తుందన్నారు. కిశోర బాలికలు విధిగా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు.
అంగన్వాడి కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు అక్షర జ్ఞానంతో పాటు ఆటపాటలు నేర్పించాలని అన్నారు. కేంద్రాల ద్వారా పంపిణీ చేసే సరుకులు సకాలంలో పంపిణీ చేయాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అంగన్వాడీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మమత, అంగన్వాడీ టీచర్ ఇందిరా, గ్రామస్తులుహన్మంతు రాజు తదితరులు పాల్గొన్నారు.
