ప్ర‌తి గ్రామానికి న‌ర్సింగ్ సేవ‌లు

ప్ర‌తి గ్రామానికి న‌ర్సింగ్ సేవ‌లు

  • వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర్ రాజ‌న‌రసింహ‌

ఉమ్మ‌డి మెద‌క్ ఆంధ్ర‌ప్ర‌భ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యరంగంలో మరో ముఖ్యమైన(Important) అడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ప్రారంభించనుంది.

ఈ క్రమంలో 34 మొబైల్ స్క్రీనింగ్(mobile screening) వాహనాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేర‌కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదార్ రాజ‌న‌ర‌సింహా అన్నారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీ నుండి వర్చువల్(virtual)గా ప్రారంభించిన ఆయ‌న మాట్లాడారు.

క్యాన్సర్‌ అనేది అత్యంత ప్రమాదకరమైన ఎన్సీడీ వ్యాధి అని, సమయానికి గుర్తించకపోతే రోగి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నార‌ని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు క్యాన్సర్(cancer) పై అవగాహన లోపం, నిర్ధారణ ఆలస్యం ప్రధాన సమస్యలుగా ఉన్నాయని అధికారులు తెలిపార‌ని చెప్పారు.

ఈ లోటును నివారించేందుకు గ్రామీణ స్థాయిలో స్క్రీనింగ్ వాహనాల ద్వారా ప్రతి కుటుంబానికీ నిర్ధారణ(diagnosis) పరీక్షలు అందించనున్న‌ట్లు తెలిపారు. ప్రస్తుతం నిమ్స్, ఎంజీఎం ప్రముఖ ఆసుపత్రుల్లో 80 పడకలతో ప్రత్యేక క్యాన్సర్ విభాగాలు కొనసాగుతున్నాయ‌ని మంత్రి దామోద‌ర్ అన్నారు. రాబోయే నెలల్లో వరంగల్, సంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్(Mahabubnagar) జిల్లాల్లో ఆధునిక రేడియేషన్ బంకర్లతో కూడిన డే కేర్ సెంటర్లు కూడా ప్రారంభించనున్నారు.

దీని ద్వారా రోగులు ఉదయం చికిత్స పొందిన తరువాత అదే రోజున సాయంత్రం తమ ఇంటికి తిరిగి వెళ్లేలా చేయడం, ఆర్థిక భారాన్నితగ్గించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమ‌న్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి(Chief Minister) ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నార‌న్నారు. రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత నిపుణుడు డాక్టర్ నూరి దత్తాత్రేయ గారిని “అడ్వైజర్ – క్యాన్సర్ ఎలిమినేషన్”గా నియమించి, ఆయ‌న అనుభవాన్ని రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

అదే సమయంలో నర్సింగ్ రంగంలో కూడా ప్రభుత్వం కొత్త అవకాశాలను కల్పిస్తోంద‌ని మంత్రి దామోద‌ర్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి నర్సింగ్ అధికారులను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా, ప్రతి సంవత్సరం 3,000 మంది విద్యార్థులకు నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నార‌న్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 35 బీఎస్సీ నర్సింగ్ కళాశాలలు, 183 జీఎన్ఎమ్ నర్సింగ్ కళాశాలలు(GNM Nursing Colleges) ఉన్నాయ‌ని చెప్పారు. విద్యార్థులకు జర్మన్ లాంగ్వేజ్ సహా అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించి, గ్లోబల్ అవకాశాలు కల్పించే దిశగా కూడా చర్యలు కొనసాగుతున్నాయ‌న్నారు.

Leave a Reply