Nursing | నట్టల మందు పంపిణీ కార్యక్రమం…
Nursing | నార్సింగి, ఆంధ్రప్రభ : శేరిపల్లి గ్రామంలో పశువుల ఆరోగ్య పరిరక్షణ(Health protection)కు సర్పంచ్ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గోండ సంతోష స్వామి మాట్లాడుతూ… ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నట్టల మందును గొర్రెలు, మేకలు పెంచే రైతులు తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. నట్టల మందుతో పశువులు ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఉత్పత్తి(production) కూడా పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సభ్యులు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

