హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : త‌లస‌రి ఆదాయం (Per capita income)లో దేశంలోనే తెలంగాణ (Telangana) రాష్ట్రం నెంబ‌ర్ వ‌న్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) మల్లు అన్నారు. ఈ రోజు జ‌రిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. వ్యవసాయం (Agriculture), పారిశ్రామిక, సేవా రంగాల్లో స్థిరమైన వృద్ధితో దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ‌ నిలిచింద‌న్నారు. వార్షిక రుణ ప్ర‌ణాళిక‌లో మొద‌టి క్వార్ట‌ర్ లోనే 33.64% సాధించడం అభినందనీయమ‌ని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు(Indiramma’s house), స్వయం ఉపాధి పథకాలకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు ఇవ్వాల‌ని కో్రారు.

బ్యాంక‌ర్లు మాన‌వీయ కోణంలో ఆలోచించాలి
తెలంగాణ‌లో బ్యాంక‌ర్లు (bankers) మాన‌వీయ కోణంలో ఆలోచించాల‌ని భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా భావిస్తుంద‌ని, రైతుల పక్షాన రైతు రుణమాఫీ (loan waiver), రైతు భరోసా పేరిట 30 వేల కోట్లు రైతుల పక్షాన బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింద‌న్నారు. బ్యాంకింగ్ (banking) రికవరీ చరిత్రలో ఇది ఒక రికార్డు అని అన్నారు. రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వాల‌ని కోరారు. ఆస్తుల తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయండి అంటూ రైతులను ఒత్తిడి చేయ‌వ‌ద్ద‌ని కోరారు.

Leave a Reply