తెలుగు ప్రజల గుండెచప్పుడు తెలుగుదేశం పార్టీ….

తెలుగు ప్రజల గుండెచప్పుడు తెలుగుదేశం పార్టీ….

  • మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
  • గొల్లపూడిలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం.

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : తెలుగువారి ఆరాధ్యదైవం అన్న ఎన్టీఆర్ ఆశీస్సులతో విజనరీ లీడర్, సీఎం చంద్రబాబు నాయకత్వంలో 44 ఏళ్లుగా తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మైలవరం నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా జరుపుకుంటున్నారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో వన్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆదివారం ఉదయం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు.

తొలుత అన్న ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేకును కట్ చేసి పంచుకున్నారు. పండ్లు పంపిణీ చేశారు. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు అంటూ నినదించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలను సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ ఎందరో మహనీయుల స్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీని స్థాపించి నేటికి 44 ఏళ్లు పూర్తి అయి, నేడు 45వ ఏడాదిలో అడుగు పెడుతున్న సందర్భంగా శుభాభినందనలు తెలిపారు.

1982 మార్చి 29న మన తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం అన్న ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారని, నేను తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగుదేశమే, నా రాజకీయ పార్టీ అని ఎన్టీఆర్ పార్టీ స్థాపించారన్నారు. కులమతాలకు అతీతంగా తెలుగు గడ్డను అభివృద్ధి చేశారని అన్నారు. ఇదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు , మంత్రి నారా లోకేష్ పార్టీని నడిపిస్తున్నారన్నారు. టీడీపీ తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో నిమగ్నమైందన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారతకు పార్టీ పెద్దపీట వేసిందన్నారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలు సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply