NTR | ఫ్యాన్స్ పై ఎన్టీఆర్ ఫైర్

NTR | ఫ్యాన్స్ పై ఎన్టీఆర్ ఫైర్
NTR | ఎన్టీఆర్‌కు కోపం తెప్పించిన ఫ్యాన్స్ హడావిడి
కిమ్స్ ఆస్పత్రి కార్యక్రమంలో ఫ్యాన్స్‌కు వార్నింగ్
వార్ 2 ఈవెంట్లో కూడా ఇదే పరిస్థితి
ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ భారీ సినిమా
దేవర 2 షూటింగ్ ఎప్పుడు ప్రారంభం?
NTR | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : స్టార్ హీరోలు ఏదైనా ఈవెంట్స్ లో మాట్లాడుతున్నప్పుడు అభిమానులు ఎంత హడావిడి చేస్తారో అందరికీ తెలిసిందే. తమ అభిమాన హీరోని చూసినప్పుడు ఫ్యాన్స్ (Fans) లో ఎక్కడలేనంతగా.. ఎప్పుడు లేనంతగా జోష్ వచ్చేస్తుంది. దీంతో నినాదాలు చేస్తారు. అది ఒక్కోసారి శృతి మించితే.. ఆయా హీరోలకు కోపం రావడం.. స్వీట్ గా వార్నింగ్ ఇవ్వడం.. చూస్తుంటాం. ఎన్టీఆర్ కూడా అదే చేసారు. అయితే.. ఈ వార్నింగ్ కాస్తా సీరియస్ గా ఇచ్చారు. ఇంతకీ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి వార్నింగ్ ఎప్పుడు..? ఎందుకు..? ఇచ్చాడు..?

NTR | ఎన్టీఆర్ కి కోపం వచ్చింది..
గత సంవత్సరం వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. బాలీవుడ్ (Bollywood) స్టార్ హృతిక్ రోషన్ కూడా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ రావడం.. తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ బాలీవుడ్ మూవీ కావడంతో ఆ సినిమా పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ అంచనాలను అందుకోలేకపోయింది అది వేరే సంగతి. అయితే.. ఆ ఈవెంట్ లో వేరే అతిథులు మాట్లాడుతుంటే.. ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ అరవడంతో.. యంగ్ టైగర్ కి కోపం వచ్చింది. అప్పుడు అభిమానులకు కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

NTR | ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ వార్నింగ్..
ఇప్పుడు బెంగుళూరులో కిమ్స్ హాస్పటల్ (Kims Hospital) ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవంలో డాక్టర్ గురువారెడ్డి మాట్లాడుతున్నప్పుడు అభిమానులు పదే పదే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదలు చేశారు. దీంతో యంగ్ టైగర్ కి కోపం వచ్చింది. వెంటనే మైక్ తీసుకుని క్వయిట్.. క్వయిట్ అంటూ చాలా సీరియస్ గా అభిమానులకు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో అక్కడ ఉన్న అభిమానులు సైలెంట్ అయ్యారు. ఇలా ఈవెంట్ కి వెళితే తమ అభిమాన హీరోకి కోపం వచ్చేలా నినాదాలు చేయడం గురించి అభిమానులు కూడా ఆలోచించాలి.. మారాలి.

NTR | దేవర 2 ఎప్పుడు…?
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా రుక్మిణి వసంత్ నటిస్తుంది. ఈ సినిమాని జూన్ 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న ఎన్టీఆర్ (NTR) సినిమా దేవర 2. దీనికి కొరటాల శివ డైరెక్టర్. ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈపాటికే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా ఆలస్యం అయ్యింది. ఇప్పుడు డిసెంబర్ నుంచి ఈ క్రేజీ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం.
