షూటింగ్‌లో ప్ర‌మాదం..

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఒక యాడ్ షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. షూటింగ్ సమయంలో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. వైద్యులు వెంటనే ప్రాథమిక చికిత్స అందించ‌గా… పెద్దగా ఆందోళన చెందాల్సిన ప‌రిస్థితి లేదని ఎన్టీఆర్ టీమ్ తెలిపింది.

ఈ ఘటన గురించి తెలిసిన‌ వెంటనే ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందారు. అయితే, ఆయన క్షేమంగా ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఎన్టీఆర్ – నీల్ !!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా కసరత్తులు చేస్తూ తన శరీరాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు.

ఇటీవల ఆయన జిమ్‌లో కష్టపడి వ్యాయామం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో బయటకు వ‌చ్చిది. దీంతో అభిమానులు ఉత్సాహంగా స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ ఫిట్‌నెస్‌పై చూపుతున్న శ్రద్ధను చూసి “డ్రాగన్ సినిమా కోసం మాస్ లెవల్ ట్రాన్స్‌ఫార్మేషన్” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతుండగా, భారీ యాక్షన్ సన్నివేశాలు, టాలీవుడ్‌లో ఇంతవరకు లేని విజువల్ ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 2026 జూన్ 25న గ్రాండ్ రిలీజ్ కి చిత్రబృందం సిద్ధమవుతోంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Leave a Reply