కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపులో ఎన్‌ఎస్‌యు ఐకృషి

- ఎన్‌ఎస్‌యుఐ మండల అధ్యక్షుడు ఆవుల దిలీప్ కుమార్
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్‌ఎస్‌యుఐ తన వంతు కృషి చేసింది అని ఎన్‌ఎస్‌యుఐ మండల అధ్యక్షుడు ఆవుల దిలీప్ కుమార్ తెలిపారు.
నర్సింహులపేట గ్రామంలో సామాన్యుడిని సర్పంచ్‌గా గెలిపించడంలో కాంగ్రెస్ పార్టీ ఘనత సాధించిందని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో భాగంగా దళితులకు పెద్దపీట కల్పించడం, ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా ఎన్నికల్లో సముచిత ప్రతినిధి స్థానం ఇవ్వడం వంటి పరిణామాలను ఆయనే పేర్కొన్నారు.
మండలంలో గెలిచిన నూతన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
