Nominations | మూడో విడత చివరి రోజు పోటాపోటీగా నామినేషన్లు

Nominations | మూడో విడత చివరి రోజు పోటాపోటీగా నామినేషన్లు

  • పూజలు, ర్యాలీలతో పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు
  • నామినేషన్లు పూర్తి కావడానికి రాత్రి పది దాటే అవకాశం

Nominations | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు మూడవ విడత ఈ నెల 17వ తేదీన జరగనుండగా వాటికి సంబంధించిన నామినేషన్లను(Nominations) వేయడానికి శుక్రవారం చివరి రోజు కావడంతో స్వతంత్ర అభ్యర్థులుగా పెద్ద ఎత్తున సర్పంచ్ స్థానాలకు వార్డు మెంబర్స్(ward members) స్థానాలకు పోటీపడి తమ తమ నామినేషన్లను దాఖలు చేశారు.

నామినేషన్ల దాఖలుకు సాయంత్రం ఐదు గంటల వరకే సమయం నిర్ణయించినప్పటికీ నామినేషన్లు వేయడానికి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలకు పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలి రావడంతో సర్పంచ్ అభ్యర్థులకు, వార్డు మెంబర్స్ అభ్యర్థులకు టోకెన్లు జారీ చేశారు. నామినేషన్ల మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 36 మంది(36 people), రెండవ రోజు 22 మంది తమ తమ నామినేషన్లు దాఖలు చేయగా చివరి రోజు అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.

నామినేషన్ల దాఖలు కు ఇచ్చిన గడువు ఐదు గంటల వరకు సగం మంది కూడా నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ముందుగా ఇచ్చిన టోకెన్ నెంబర్ల వారిగా అభ్యర్థులను పిలిచి అధికారులు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. నామినేషన్ లు అందరివి స్వీకరించడానికి రాత్రి సుమారు 10 గంటలు(around 10 pm) దాటవచ్చునని అధికారులు తెలిపారు.

కాగా చివరి రోజు అల్లాపురం గ్రామ సర్పంచ్ గా తాజా మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి భార్య కొలను శిల్పా శ్రీనివాస్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా, ఎనగంటి తండా సర్పంచ్ గా కాంగ్రెస్ బలపరిచిన పానుగోతు లచ్చు నాయక్ తదితరులు డి నాగారం సెక్టార్ కేంద్రంలో తమ నామినేషన్లను దాఖలు చేశారు.

కొయ్యలగూడెం సర్పంచిగా కాంగ్రెస్ బలపరిచిన గంజి వనజా కృష్ణ(Ganji Vanaja Krishna) స్థానిక సెక్టార్ కేంద్రంలో తమ నామినేషన్ ను దాఖలు చేశారు. అదేవిధంగా ఆరేగూడెం గ్రామ సర్పంచిగా బిజెపి బలపరిచిన మునుగాల స్వప్న మహిపాల్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నెపల్లి ధనలక్ష్మి వెంకట్ రెడ్డి లు వేరువేరుగా పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివెళ్లి పంతంగి సెక్టార్ కేంద్రంలో తమ తమ నామినేషన్ లను దాఖలు చేశారు.

Leave a Reply