nominations | అప్రమత్తంగా ఉండండి

nominations | అప్రమత్తంగా ఉండండి

  • నామినేషన్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు
  • నారాయణపేట అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్

nominations | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నామినేషన్ సమయం ముగిసే వరకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట అదనపు కలెక్టర్ సంచితు గంగ్వార్(Sanchitu Gangwar) ఆదేశించారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో మూడో విడత నామినేషన్ల చివరి రోజు కావడంతో ఊట్కూర్, చిన్న పోర్ల నామినేషన్ కేంద్రాలను(nomination centers) పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల్లో పీఓ, పీఓలతో నామినేషన్ ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వం మూడో విడత సర్పంచ్, వార్డు స్థానాల నామినేషన్లకు ప్రక్రియ సజావుగా జరిగే విధంగా ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. నామినేషన్ల(nominations) చివరి రోజు కావడంతో అభ్యర్థులు ఒకేసారి వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియతో పాటు పోలింగ్ ముగిసే వరకు అధికారులందరూ జవాబుదారితనంతో విధులు చేపట్టాలన్నారు.

నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. మండలంలో ఎన్ని నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారని ఎంపీడీవోను అడగ్గా 6 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కిషోర్ కుమార్(MPDO Kishore Kumar), పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసరావు, గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply