Nomination | ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా..

Nomination | ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా..

Nomination | ఇల్లందకుంట, ఆంధ్రప్రభ : ఒక్కసారి ఆదరించి.. ఆశీర్వదించి.. తనకు అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సిరిసేడు గ్రామ సర్పంచ్ అభ్యర్థి రేణుకుంట్ల శ్యామల కుమార్ పేర్కొన్నారు. ఈ రోజు సిరిసేడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్(Nomination) వేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఎంపీటీసీగా పోటీ చేసి రెండు ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయానని గుర్తు చేశారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మళ్లీ మీ ముందుకు వచ్చానని, గ్రామ సర్పంచ్‌గా ప్రజలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామ ప్రజలకు(village people) సేవ చేసి చూపిస్తానన్నారు.

గ్రామ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తాననని హామీ ఇచ్చారు. ప్రజలు తన పై నమ్మకముంచి సర్పంచ్ గెలిపించాలని శ్యామల కుమార్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply