దళారులకు వద్దు..
వెంకటాపూర్, ఆంధ్రప్రభ – ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ చేద సారంగపాణి అన్నారు. సోమవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామ ఆదర్శ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం సారంగపాణి మాట్లాడారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని, 17 శాతం తేమ ఉండేలా చూసుకోవాలన్నారు. ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా ఐకేపీ కేంద్రాల్లో విక్రయించి ఏ గ్రేడ్ కు రూ.2,389, కామన్ గ్రేడ్ కు రూ.2,369 మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు తరలించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గొర్రె లక్ష్మీ ఓదెలు, మాజీ ఉప సర్పంచ్ వేల్పుల సమ్మయ్య, రైతులు గొర్రె రాజయ్య, దొనకొండ రాజిరెడ్డి, జూపల్లి రాజు, ఉడుత రవి, పల్లెవేణి భద్రయ్య, రేగులపాటి శ్రీరాములు, దిగిని సమ్మయ్య, బొడ్డుపల్లి స్వామి, గుండేటి సంతోష్, కోట సదయ్య, ఆదర్శ గ్రామైఖ్య సంఘం అధ్యక్షురాలు పల్లెవేణి సమ్మక్క, కార్యదర్శి వేల్పుల భాగ్య, కోశాధికారి సింగిరెడ్డి సబిత తదితరులు ఉన్నారు.

