Delhi| కేసీఆర్ కుటుంబాన్ని వ‌దిలే ప్ర‌స‌క్తే లేదు – రేవంత్ రెడ్డి

న్యూ ఢిల్లీ : ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone tapping case) లో విచాణను వేగవంతం చేశామని, త్వరలోనే నిజాలన్నీ బయటకు వస్తాయని అన్నారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). కేసులో విషయంలో తాను అనవసర హడావుడి చేయబోనని అంటూ కానీ, కేంద్రం ఈ విషయంలో తలదూర్చుతూ అడ్డు పడుతోందని ఆరోపించారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రేవంత్ ఇవాళ‌ మీడియాతో మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) లో జరిగిన అవినీతిపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.. తాము అధికారంలోకి వచ్చాకే అరెస్టులు (Arrests) చేస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ (KCR) ను కాపాడేందుకు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి (Kishan Reddy) తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని.. అందుకే కాళేశ్వరంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ వారి చెప్పుచేతల్లోనే ఉన్నాయి కాబట్టి పని సులువు అవుతుందనే భావనలో కిషన్ రెడ్డి ఉన్నారేమోనని కామెంట్ చేశారు.

లోకేష్ తో కేటీఆర్ భేటి వెనుక …
కాగా, నారా లోకేశ్‌ను కేటీఆర్ రహస్యంగా కలిశారని.. అర్ధరాత్రి పూట డిన్నర్ మీట్ పెట్టడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఇక కేటీఆర్ నాయకత్వాన్ని ఆయన చెల్లి కవితే ఒప్పుకోవడం లేదని పేర్కొన్నారు. కొడుకు కేటీఆర్‌కు కేసీఆర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదాను ఇవ్వడం లేదని.. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో లేక స్లీపింగ్ ప్రెసిండెంటో తనకు తెలియదని సెటైర్లు వేశారు. ముందు ఆయన కుటుంబం అంతా ఒక తాటిపైకి రావాలని, ఆ తరువాత‌ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాలని హితవు పలికారు. తనకు ఎవరితో ఎలాంటి శతృత్వాలు.. వైరుధ్యాలు లేవని.. కేసీఆర్ కేవలం తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని రేవంత్ అన్నారు.

స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఫామ్ హౌస్ కా..
రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ఢిల్లీకి కాకపోతే.. ఫామ్‌హౌస్‌కు వెళ్లాలా అంటూ రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. పదే పదే సీఎం ఢిల్లీకి వెళ్తున్నాడని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్‌పై ఆయన ఫైర్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయన్నారు. బనకచర్ల పై జలశక్తి సమావేశంలో ఏం జరిగిందో కేంద్రమే చెప్పిందని తెలిపారు. దీనిపై మాట్లాడేందుకు ఏమీ లేద‌న్నారు.

Leave a Reply