Nizampet | గడించెరువులో చేప పిల్లల పంపిణీ..

Nizampet | గడించెరువులో చేప పిల్లల పంపిణీ..

Nizampet | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని గడిం చెరువులో ఇవాళ‌ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో 36వేల చేప పిల్లలను పంపిణీ చేయడంతో మత్స్యశాఖ ఏడి మల్లేశం, గ్రామపంచాయతీ పాలకవర్గం, గంగపుత్ర ఆధ్వర్యంలో చేప పిల్లలను చెరువులో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం 100శాతం సబ్సిడీ ద్వారా గడిం చెరువులో 36వేల చేప పిల్లలను విడుదల చేశామని, దీనిలో 14400 కట్ల, 18 వేల రవ్వు, 3600 మీర్గే రకాలను అందించారని గంగపుత్రుల అభ్యున్నతికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాలకవర్గానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈకార్యక్రమంలో మత్స్యశాఖ సిబ్బంది ఫిషర్ మెన్ మల్లేశం, జయరాములు, గ్రామ సర్పంచ్ చలమేటి నరేందర్, ఉప సర్పంచ్ గేరిగంటి బాబు, వార్డు సభ్యులు నగేష్ నాయిని, లక్ష్మణ్, టంకరి ప్రశాంత్, గంగపుత్రులు శేఖర్, మంగలి పల్లి సత్తయ్య, నర్సింలు, శివకుమార్, సత్యనారాయణ, లక్ష్మణ్, పంజా బాబు, సుధాకర్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply