Nizamabad | గొనుగోలుకు చివ‌రి తేదీ డిసెంబ‌ర్ 10

Nizamabad | గొనుగోలుకు చివ‌రి తేదీ డిసెంబ‌ర్ 10

Nizamabad | సదాశివనగర్, ఆంధ్రప్రభ : డిసెంబర్ 10 వరకు మొక్కజొన్న కొనుగోలు పూర్తి చేయాలని మార్కుఫెడ్ జిల్లా మేనేజర్ శశిధర్ రెడ్డి తెలిపారు. సదాశివనగర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని కామారెడ్డి మార్కుఫెడ్(Kamareddy Markufed) జిల్లా మేనేజర్ శశిధర్ రెడ్డి ఈ రోజు సందర్శించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. డిసెంబర్ 10వ‌ర‌కు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం చివరి తేదీ అని, రైతులు త్వరగా కొనుగోలు కేంద్రాలకు తరలించాలన్నారు. కొనుగోలు చేసే మక్కల తేమ శాతం పరిశీలించి తర్వాత తూకం వేయాలని కొనుగోలు కేంద్రం సిబ్బందికి సూచించారు.

తూకం వేసిన మక్కల బస్తాలు వెంట వెంటనే తరలించాలని తెలిపారు. అయన వెంట సొసైటీ చైర్మన్ వరికల కమలాకర్ రావు, మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి, సెక్రటరీ విగ్నేష్ గౌడ్, సిబ్బంది ఉన్నారు.

Leave a Reply