గోదావరి నదిలో మృతదేహాల కలకలం…

గోదావరి నదిలో మృతదేహాల కలకలం…
యువకుని మృతదేహం వివరాలు లభ్యం!
గుర్తు తెలియని మహిళ మృత దేహం కేసు
బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : బాసర గోదావరి నదిలో ఆదివారం రెండు (ఆడ, మగ) వేరు వేరు మృతదేహాలు నీటిపై తేలియాడుతూ కనపడడం కలకలం రేపింది.స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గోదావరి నది బ్రిడ్జి వద్ద కు వెళ్లి మృత దేహాలను పరిశిలించారు. బస్సు బ్రిడ్జ్ పిల్లర్ సమీపాన పురుషుని మృత దేహం ఆచూకీ లభించడంతో గజ ఈత గాళ్ల సహాయంతో మృత దేహాన్ని వెలికి తీశారు.
మృతుని వద్ద లభించిన ఆధారాలతో నిజామాబాద్ పట్టణంలోని గాజులపేట్ కు చెందిన ఆకాష్ 35 సంవత్సరాలుగా గుర్తించారు. కుళ్లిపోయిన స్థితిలో మహిళామృతదేహం బ్రిడ్జి నాలుగో పిల్లర్ వద్ద లభించింది. మహిళ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో గజ ఈతగాళ్ల సాయంతో వెలికి తీశారు. మృదురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు గుర్తు తెలియని మృత దేహంగా కేసు నమోదు చేసుకున్నారు.
మృతురాలి వయస్సు 35 వరకు ఉంటుందని, ఆకుపచ్చ జాకెట్, ఆకుపచ్చ గులాబీ రంగు చీర ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాట్లు సీఐ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ఒకేరోజు రెండు మృతదేహాలు లభ్యం కావడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. వయసు ఒక మాదిరిగా ఉండడంతో పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.
