Nizam Government | ఆ మహనీయుల వర్ధంతికి తరలిరావాలి ..

Nizam Government | ఆ మహనీయుల వర్ధంతికి తరలిరావాలి ..

  • మహనీయులు ప్రొఫెసర్ హైమాన్ డార్ప్-బెట్టి ఎలిజబెత్ల వర్ధంతి పోస్టర్ల విడుదల

Nizam Government | జైనూర్, ఆంధ్రప్రభ : అడవి బిడ్డల జీవనస్థితి గతులను అధ్యయనం చేయడానికి తమ జీవితాన్ని ధార పోసి ఆదివాసి(aboriginal) గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహామనిషి ప్రొఫెసర్ హైమాన్ డార్ప్-బెట్టి ఎలిజబెత్ దంపతులు అని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాత్ రావు, అసిఫాబాద్ అసిఫాబాద్ మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ రావు, జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్, నాయకులు అన్నారు.

ఇవాళ జైనూర్ మార్కెట్ కమిటీ ఆవరణంలో ఆదివాసి నాయకుల ఆధ్వర్యంలో జనవరి 11న మార్లవాయిలో నిర్వహించిన మహనీయుల 39వ వర్ధంతికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆదివాసుల హక్కుల కోసం కొమరం భీమ్ పోరాటం చేయగా, అప్పటి నైజాం సర్కార్(Nizam Government) ఆదివాసుల దిమాలపై అధ్యయనం చేయడానికి ఈ మహనీయులు ప్రొఫెసర్ హైమాన్ డార్ప్ దంపతులను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీకి తరలించగా, వారు జైనూరు మండలం మర్లవాయిలో ఉంటూ ఆదివాసుల స్థితిగతులపై అధ్యయనం చేయడం అప్పటి నైజాం ప్రభుత్వానికి వారు పంపిన నివేదికలతో హక్కులు కలిగాయన్నారు. మార్లవాయిలో జరిగే ఆ మహానీయుల వర్ధంతికి అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు.

అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ విశ్వనాథ్రౌ గ్రంథాలయ మాజీ చైర్మన్ యాదవరావు గెలుపొందిన నూతన సర్పంచులకు శాలువాలతో సన్మానం చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో జైనూర్ సర్పంచ్, కొడప ప్రకాష్, మార్లవాయి సర్పంచ్ కనక ప్రతిభ సర్మెడి మెస్రం(Sarmedi Mesram) భాదిరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముఖిద్, మాజీ వైస్ ప్రసిడెంట్ చీర్లే లక్ష్మన్, మెస్రం అంబాజీ రావు, ఆత్మ చైర్మన్ రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కనక గంగారం, మండాడి లింగు, పంద్ర శేఖు, నాయకులు, ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా నాయకులు కుమ్రం శంకర్, మెస్రం శ్రీకాంత్ కేంద్రే విశాల్, మాజీ సర్పంచ్ కుమ్రం శ్యాంరావు, మాజీ సర్పంచ్ మడవి భీంరావు, సర్పంచ్ మడవి లక్ష్మన్, తోడసం రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply