Nirmal | కడెంలో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

Nirmal | కడెంలో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
Nirmal | కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలంలో 141వ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను కడెం మండల అధ్యక్షులు తుమ్మల మల్లేష్ యాదవ్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగేల భూషణ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సీహెచ్. భవాని, మాజీ జెడ్పీటీసీ తక్కల్ల రాధాసత్యనారాయణ, టౌన్ అధ్యక్షులు వాజిద్ నచ్చన్, ఎల్లాపూర్ మాజీ సర్పంచ్ బొడ్డు గంగన్న, మండల నాయకులు షేక్ రఫిక్, ఎంఏ రహీం, తొట్ల ధర్మయ్య, బబ్లు, బ్రహ్మచారి, తొట్ల గంగాధర్ శేఖర్, రాజేశ్వర్, వసి మల్లయ్య, రాజన్న పాల్గొన్నారు
