MBNR | తులసి వనంలో గంజాయి మొక్క నిరంజన్ రెడ్డి : ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి ప్రతినిధి, మే 18 (ఆంధ్రప్రభ) : భూ కబ్జాల నిరంజన్ రెడ్డి తులసి వనంలో గంజాయి మొక్క లాంటివాడని వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఆరోపించారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ… మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఎక్కడ చూసినా కబ్జాలు, అవినీతికి పాల్పడ్డాడని.. అది చాలదంటూ.. జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండలం చందూర్ గ్రామంలో బినామీల పేర్లపై సర్వే నెంబర్.57 లోని 2ఎకరాల 19 గుంటలు భూమిని భూక‌బ్జా నిజమేనని నిర్ధారణ కావడంతో రెవెన్యూ శాఖ అధికారులు అక్రమణదారులకు నోటీసులు జారీ చేశారని ఎమ్మెల్యే తెలిపారు.

వనపర్తికి ఒక చరిత్ర ఉందని, గత ఎమ్మెల్యేలు మచ్చ లేకుండా పాలన అందిస్తే.. నిరంజన్ రెడ్డి మాత్రం తులసి వనంలో గంజాయి మొక్కలాగా కబ్జాలు, అవినీతులకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అవినీతి, భూకబ్జాలను నిరూపించడంలో భాగంగా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కు చేసిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు గద్వాల్ జిల్లా కలెక్టర్ సూచనతో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేశారన్నారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కబ్జాలకు పాల్పడలేదని, దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారని.. నిరంజన్ రెడ్డి కబ్జాల బాగోతంపై ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. భూకబ్జాలకు పాల్పడ్డ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని కేసీఆర్, కేటీఆర్ లు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో అవినీతి లేని అభివృద్ధిని చేసి చూపిస్తానని పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పిసిసి సభ్యులు శంకర్ ప్రసాద్, జిల్లా దిశ కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, పట్టణ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు. బ్రహ్మం, నంది మల్ల శ్యామ్,వెంటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నందిమల్ల చంద్రమౌళి, మండ్ల దేవన్న, సత్య శీల రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *