సత్యసాయి జిల్లా (Sri Sathya Sai District) సోమందేపల్లి మండలంలో ఇటీవల జరిగిన ఒక సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల కూతురు అయిన 22 ఏళ్ల హర్షిత(Harshita) వివాహం(marriage) జరిగిన కొద్ది గంటలకే ఆత్మహత్య (suicide) చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హర్షితకు కర్ణాటక (Karnataka) లోని బాగేపల్లికి చెందిన నాగేంద్ర (Nagendra)తో సోమవారం ఉదయం వివాహం జరిగింది. తొలి రాత్రి ఏర్పాట్లు సోమందేపల్లి (Somandepalli) లోని ఆమె స్వగ్రామంలోనే చేశారు. రాత్రి తన గదిలోకి వెళ్లిన హర్షిత, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. తలుపు తట్టినా ఎలాంటి స్పందన రాకపోవడంతో, తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ఆమె పైకప్పుకు వేలాడుతూ కనిపించింది.
వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వివాహం జరిగిన రోజే ఇలాంటి విషాదం (Tragedy) చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు (police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.