SHABARISH | మహబూబాబాద్ జిల్లాకు కొత్త ఎస్పీ నియమితులైన డాక్టర్ పి. శబరిష్
SHABARISH |మహబూబాబాద్ ప్రతినిథి, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా నూతన పోలీసు సూపరింటెండెంట్గా డాక్టర్ పి. శబరిష్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గురువారం విడుదల చేసిన బదిలీల ఉత్తర్వుల్లో వెల్లడించింది. ప్రస్తుతం జిల్లాలో ఎస్పీగా పనిచేస్తున్న సుధీర్ రాంనాథ్ కేకన్ను ములుగు జిల్లా ఎస్పీగా బదిలీ చేసింది. శబరిష్ ఇప్పటికే పలు జిల్లాల్లో సమర్థవంతమైన విధానాలతో సేవలు అందించి మంచి పేరును పొందారు.
ఆయన బాధ్యతలు స్వీకరిస్తే ప్రజల, శాంతి భద్రతల పరిరక్షణలో కొత్త ఉత్సాహం రానున్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, ములుగు జిల్లాకు వెళుతున్న సుధీర్ రాంనాథ్ కేకన్ తన పదవీకాలంలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. కొత్త బాధ్యతలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

