New President | వెనెజువెలా అధ్యక్షురాలిగా డెల్సీ

New President | వెనెజువెలా అధ్యక్షురాలిగా డెల్సీ

New President | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : అమెరికా దాడుల నేపథ్యంలో వెనెజువెలా దేశంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను తాత్కాలిక అధ్య‌క్షురాలిగా నియమిస్తూ ఆ దేశ సుప్రీం కోర్టు (Court) ఉత్తర్వులు జారీ చేసింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో సహా ఆయన సతీమణి సిలియా ఫ్లోరస్‌లను అమెరికా సైన్యం బంధించి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభ పరిస్థితుల్లో ప్రభుత్వ పాలన కొనసాగింపు, దేశ సార్వభౌమాధికారాన్ని రక్షించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు న్యాయస్థానం పేర్కొంది.

New President | నికోల‌స్ మ‌దురోకు అత్యంత స‌న్నిహితురాలు

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన డెల్సీ , మదురోకు అత్యంత సన్నిహతురాలు. విప్లవ నేత, లిగా సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు జార్జ్ ఆంటోనియో కుమార్తె. 1969లో వెనెజువెలా రాజధాని కాకరాస్‌లో జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన డెల్సీ.. మదురో ప్రభుత్వంలో కమ్యూనికేషన్, విదేశాంగ మంత్రిగా (Minister) పనిచేశారు. ఆ తర్వాత 2018 నుంచి ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రోడ్రిగ్జ్.. తన సోదరుడు నేషనల్ అసెంబ్లీ చీఫ్ జార్జ్ రోడ్రిగ్జ్‌తో కలిసి మదురో ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అలా ఆమె ఆ దేశ రాజకీయాల్లోనే కాకుండా ఆర్థిక వ్యవస్థపై కూడా పట్టు సాధించారు. దీంతో ఆమె ఆర్థిక, చమురు శాఖల మంత్రిగానూ సేవలందిస్తున్నారు.

CLICK HERE TO READ వెనిజులా అధ్యక్షుడు.. భార్యను పట్టుకున్నాం

CLICK HERE TO READ MORE

Leave a Reply