ఏలూరు జిల్లా పోలీసుల నయా హిస్టరీ

ఏలూరు జిల్లా పోలీసుల నయా హిస్టరీ

ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ : ఏలూరు జిల్లాలో 59 కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న సుమారు మూడున్నర టన్నుల గంజాయిని ధ్వంసం చేయటానికి సన్నద్ధమయ్యారు. గుంటూరు జిల్లా(Guntur District) మంగళగిరి సమీపంలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సెంటర్ (Jindal Urban Waste Management Center) కు ఈ గంజాయిని తరలించారు.

వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లాలో 58 కేసులలో పోలీసులు స్వాధీనం చేసుకున్న 3403.753 కిలోల గంజాయి నీ పర్యావరణ అనుకూల పద్ధతిలో ధ్వంసం చేస్తున్నామని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఏలూరు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ(Drug Disposal Committee) ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో పట్టుకున్న గంజాయిను ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్ ఐజీ రవి కృష్ణ, ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.

సాధారణంగా గంజాయి(Ganjai)ని దహనంతో కాలుష్యం ఏర్పడుతుంది. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని గంజాయిని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సెంటర్‌ లోని ప్రత్యేక , అధునాతన యంత్రాలలో దహనం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పద్ధతిలో దహనం చేయడంతో కాలుష్యం అతి తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు, ఈ సందర్భంగా ఈగల్ ఐజీ రవి కృష్ణ(Ravi Krishna) మాట్లాడుతూ, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పోలీస్ శాఖ ఉక్కు పాదం మోపిందన్నారు. గంజాయిని ధ్వంసం చేసి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయదారు లకు గట్టి హెచ్చరిక పంపించామన్నారు.

యువత ప్రజలు డ్రగ్స్, గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్(K Pratap Shiva Kishore) మాట్లాడుతూ, గంజాయి అక్రమ రవాణాపై పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, స్వాధీనం చేసుకున్న గంజాయిని చట్ట ప్రకారం, పారదర్శకంగా ధ్వంసం చేస్తున్నట్టు తెలిపారు.

Leave a Reply